రామోజీ ఫిల్మ్ సిటీ అమ్మేస్తున్నారంట… క్లారిటీ వచ్చింది!

-

కరోనా కాలంలో చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు అనుకున్నవే అల్లల్లాడిపోతున్నాయి! వర్క్ ఫ్రం హోం అవకాశాలున్న సంస్థలకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. పబ్లిక్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే వ్యవస్థలకు చాలా ఇబ్బంది కలిగిందనే అంటున్నారు! ఈ క్రమంలో సినిమా షూటింగులు లేక సినీ కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. అలాగే సినిమా షూటింగులకు అద్దెకిచ్చే రామోజీ ఫిల్ సిటీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని అంటున్నారు! అందులో భాగంగానే ఆర్.ఎఫ్.సి. ని అమ్మేస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

అవును… దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ఫిలింసిటీగా పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీ (ఆర్.ఎఫ్.సి.)ని ఆర్ధిక ఇబ్బందులు కార‌ణంగా అధినేత రామోజీరావు అమ్మేశారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది! అమ్మ‌డం లేదు.. డిస్నీ సంస్థ‌కు మూడేళ్ల పాటు లీజుకు మాత్రమే ఇచ్చార‌ని మరికొందరు అంటున్నారు! ఇంకొంత మంది మాత్రం… రామోజీ గ్రూప్ సంస్థలు అన్నీ జనాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవి కావడంతో.. కరోనా వేల అన్నీ నష్టాల్లో ఉన్నాయని, అందుకోసమే.. ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్, మార్గదర్శి, ఈటీవీ వంటి వాటిని అమ్మలేరు కాబట్టి.. ఫిలింసిటీని అమ్మేస్తున్నారని, పైగా అది గత నాలుగు నెలలుగా తీవ్ర న‌ష్టాల్లో ఉందని, ఫలితంగా రామోజీరావు ఆ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఆ ఆన్ లైన్ ప్రచారాలు అలా ఉంటే… ఈ ప్ర‌చారాల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని తాజాగా యాజ‌మాన్యం వివ‌ర‌ణ ఇచ్చిందని చెబుతున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా ముంబైలో షూటింగ్ లు చేసుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో జీ స్టూడియోస్, సోనీ గ్రూప్ తో పాటు ఇత‌ర సినిమా, టీవీ సీరియ‌ళ్ల చిత్రీక‌ర‌ణ కోసం వాళ్లు వ‌స్తామంటే యాజ‌మాన్యం ఆహ్వానించిందే త‌ప్ప.. పూర్తిగా లీజుకిచ్చేయడం, ఏకంగా అమ్ముసుకోవడం వంటి ప‌రిస్థితి వెల్ల‌డించింది! దీంతో… “ఆర్.ఎఫ్.సి. అమ్మేస్తున్నారంట” అనే ఆన్ లైన్ వార్తకు ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది!!

Read more RELATED
Recommended to you

Latest news