హస్తిన కోర్టులో అన్నా వైఎస్సార్…. కౌటర్ లాజికి ఇదిగో!

-

ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్నాయి. అదేమంటే… కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు.. పలురకాలైన కుట్రలు, కుతంత్రాలతో కూడిన రాజకీయ కార్యకలాపాలు ఎత్తులకు పైఎత్తులు చోటుచేసుకుంటున్నాయి. విచిత్రమేమిటంటే… బలవంతుడైన వైఎస్ జగన్ ముందు అలాంటి కుప్పిగంతులు వేసేవారంతా వరుసబెట్టి ప్రజల్లో చులకన అవుతుండటం విశేషం! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఢిలీ కోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పై ఒక పిటిషన్ దాఖలైంది! అందులో లొసుగులు.. అందుకు కారణమైన సంగతులు ఇప్పుడు చూద్దాం!


తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్నా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు కూడా.

అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ క్లుప్తంగా బీజేపీ అని పిలుచుకుంటుంది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని.. తెదేపా అనేకంటే టీడీపీ అనేవారే ఎక్కువ.. పార్టీ నాయకులతో కలిపి! అలాగే అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఆయా పార్టీల పేర్లను షార్ట్ ఫామ్ లో పిలిచుకోవడం అనాదిగా సాగుతున్న వైనం. అది ఈనాటిది కాదు. ఆమాట కొస్తే… తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే అనే రెండు పార్టీలు ఉన్నాయి! అవి రెండూ అలాగే సాగుతున్నాయి. వారికి ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురైన దాఖలాలు లేవు! మరి రెండు పార్టీలుగా ఉన్న “అన్నా వైఎస్ఆర్”, “వైఎస్ఆర్సీపీ” అని పిల్చుకుంటే తప్పేంటి? సామాన్యుడి అనుమానం కం ప్రశ్న!

అందులో కోర్టులు పెద్ద తప్పుగా భావించి చెప్పాల్సిన విషయం అందులో ఏముంది అంటూ రాజకీయ విశ్లేషకులు, న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఇదేదో కొందరు పెద్ద మనుషులు రెచ్చగొడితే రెచ్చిపోయి… కాలయాపన కోసం చేస్తున్న తంతులో భాగంగా కోర్టులకు పోవడం తప్ప.. దాంతో వరిగేదేం లేదని పలువురు భావిస్తున్నారు. మరి దీనిపై విచారణలో ఏం తేలుస్తారు అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news