Ap: అత్యంత భారీ వర్షాలు.. ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. వద్దన్న వర్షం పడుతుంది. మళ్లీ ఏపీలోని ఐదు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో… మరో 24 గంటల్లో ఏపీలోని… పరి జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నట్లు… వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఏపీలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

red alert for these districts in ap

ఈ లిస్టులో తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు ఎన్టీఆర్ అలాగే అల్లూరి జిల్లాలో ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని… పేర్కొన్న అమరావతి వాతావరణ శాఖ… రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. అంతేకాదు విశాఖ పార్వతీపురం విజయనగరం అంబేద్కర్ కోనసీమ మరియు శ్రీకాకుళం జిల్లాలలో.. ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ముంపు ప్రాంతాలలో ప్రజలు ఉండకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news