జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రిజిస్ట్రేషన్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లోకి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1949 గ్రామ, వార్డు సచివాలయాల్లోకి తీసుకువస్తున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి శివరాం ప్రకటించారు. కడపలోని కమలాపురం లో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన డిఐజి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించారు.
ప్రజల ముంగిట్లోకి పౌర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో మూడేళ్ల క్రితం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ ను నియమించి వారి ద్వారా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తున్నారు. ప్రతి 2 వేల కుటుంబాలకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పరిధిలో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.