కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట

చిత్తూరు జిల్లా కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌని వాణి శ్రీనివాసులు నాయుడు, మాజీ జెడ్పిటిసి రాజకుమార్, మునుస్వామితో పాటు మరో నలుగురికి హైకోర్టు బెల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్ తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం ఘటనలో టిడిపి నేతలపై కేసు నమోదు అయింది. ఎస్సీ, ఎస్టి కేసు నమోదు చేసి టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే చిత్తూరు కోర్టు బెయిల్ తిరస్కరించడంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టిడిపి నేతల తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించింది. దీంతో ఆ ఏడుగురికి బెయిల్ మంజూరు అయింది.