అమరావతి రైతుల మహాపాదయాత్రకు గుడివాడలో ఆంక్షలు

-

12 రోజుల పాటు ప్రశాంతంగా జరిగిన అమరావతి రైతుల మహాపాదయాత్ర 13వ రోజుకు చేరింది. కృష్ణా జిల్లా కౌతవరం నుంచి రైతులు ఇవాళ పాదయాత్ర షురూ చేశారు. గుడ్లవల్లేరు, అంగలూరు మీదుగా గుడివాడకు చేరుకున్న రైతుల పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

గుడివాడ నియోజకవర్గానికి వచ్చే అన్ని రూట్లలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఇటు విజయవాడ నుంచి పామర్రు, గుడ్లవల్లేరు వరకు, మచిలీపట్నం నుంచి గుడివాడ రోడ్డు, విజయవాడ-గుడివాడ, గుడివాడ-ఏలూరు రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించి తనిఖీలు చేపట్టారు. పాదయాత్రకు వెళ్తున్నామని చెప్పే వారిని శాంతి భద్రతల దృష్ట్యా.. వెళ్లవద్దంటూ అక్కడే నిలిపివేస్తున్నారు.

మీడియా ప్రతినిధులను సైతం గుర్తింపు కార్డులుంటేనే పాదయాత్రకు వెళ్లడానికి అనుమతులు ఇస్తున్నారు. గుడివాడలో సుమారు 20వేల మందికిపైగా సామాన్యులు పాదయాత్రకు మద్దతు తెలుపుతారనే ఉద్దేశంతోనే పోలీసు ఉన్నతాధికారులు అడుగడుగునా ఆంక్షలు విధించి పాదయాత్రకు వచ్చే సామాన్యులను అడ్డుకుంటున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news