స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్…!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ సేవలు కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే స్టేట్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. చౌకగా ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ బ్యాంక్ తీసుకు వచ్చింది. వివరాలను చూస్తే..

ఎస్‌బీఐ నోటిఫికేషన్ ద్వారా తన కస్టమర్లకు . చౌకగా ట్రైన్ టిక్కెట్లను బుక్ చెయ్యచ్చని చెప్పింది. కస్టమర్లు యోనో యాప్ ద్వారా ఈ ఫెసిలిటీ ని పొందొచ్చు. స్టేట్ బ్యాంక్ యోనో ద్వారా ఐఆర్‌సీటీసీ సైటుపై ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకుంటే ఎలాంటి గేట్‌వే ఛార్జీలు పడవు.

యోనో ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేస్తే పూర్తిగా పేమెంట్ గేట్‌వే ఫీజుల నుంచి మినహాయింపు పొందచ్చని బ్యాంక్ అంది.మాములుగా అన్ని గేట్‌వే కంపెనీలు రూ.30 వరకు కూడా ఛార్జీలను విధిస్తున్నారు. కానీ ఇలా బుక్ చేసుకుంటే ఆ చార్జీలు పడవు. సింగిల్ యాప్‌లో అన్ని రకాల బ్యాంకింగ్ మరియు ఇతర సేవలను అందిస్తోంది. లోన్ అప్లికేషన్లను మొదలు నగదు లావాదేవీలను, చెక్ బుక్ ఇలా చాలా సేవలను అందిస్తున్నారు ఈ యాప్ ద్వారా.

ట్రైన్ టికెట్స్ ని ఇలా బుక్ చెయ్యండి:

మొదట ఎస్‌బీఐ యోనో యాప్ ని ఓపెన్ చెయ్యండి.
బుక్ అండ్ ఆర్డర్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
ఇప్పుడు ఐఆర్‌సీటీసీ ఐకాన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
మీకు కావాల్సిన వివరాలను ఇవ్వాలి.
పేమెంట్ చెయ్యండి. ఎక్స్ట్రా చార్జెస్ పడవు.

Read more RELATED
Recommended to you

Latest news