ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే, ఏపీలో ఓ వార్త వైరల్ అయింది. ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 నుండి 65కు పెంచేసినట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారంటూ సోషల్ మీడియాలో కలకలం రేగింది.
అయితే, ఈ ఫేక్ జీవోను సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సర్కులేట్ చేశారు. గతంలో 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సును పెంచుతూ జారీ చేసింది జీవో ట్యాంపర్. అయితే, జీవో ట్యాంపర్ చేయడంపై జగన్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫేక్ జీవో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందోననే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. జీవోను ట్యాంపర్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.