మంత్రి ధర్మానపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల మండిపాడ్డారు. రెవెన్యూ శాఖలో అవివీతి పెరిగిందంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు మనస్థాపానికి గురి చేశాయంటూ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు మాట్లాడుతూ… రేయింబవళ్లు కష్టపడి నీతి, నిజాయితీగా పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని.. ధర్మానకు రెవెన్యూ శాఖలోని కష్టాలు తెలిసి కూడా ఇలా మాట్లాడటం బాధ కలిగించిందని తెలిపారు.
కోవిడ్ కాలంలో ప్రతీ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి వారి సేవలందించారని.. క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి రీ సర్వే ను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే విజయవంతంగా పూర్తి చేయుటకు సరిపడా నిధుల్లేవని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల తక్షణమే కావాల్సిన కనీస సౌకర్యాలు, నిధుల విడుదల లేదని.. వీఐపీల ప్రోటోకాల్ కొసం కనీసం నిధులు, కోర్టు కేసుల పరిష్కారానికి అయ్యే ఖర్చులకు నిధులివ్వడం లేదని ఆగ్రహించారు.
తాశీల్దార్ల అద్దె వాహనాలకు తగిన నిధులు, కార్యాలయాల రోజువారీ ఖర్చులకు సరిపడా నిధులు సక్రమంగా విడుదల కావడం లేదని.. 2019లో సాధారణ ఎన్నికలకు సంబంధించి పెట్టిన ఖర్చులో కొంత మేర ఇప్పటికీ తాశీల్దార్లకు ప్రభుత్వం చెల్లించలేదని వెల్లడించారు.
కోవిడ్ కాలంలో ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నేటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుండి చెల్లింపులు కాలేదని.. అవినీతికి పాల్పడే అధికారులకు.. ఉద్యోగులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆంద్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సపోర్ట్ చేయదన్నారు. ప్రతి వ్యవస్థలో ఒకటి రెండు శాతం వక్రబుద్ది కలవారుంటారని చురకలు అంటించారు.