రాష్ట్రంలో బాలికలు మహిళల మీద అత్యాచారాలు జరగడం దురదృష్టకరం. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం రియాల్టీ షోలో పాల్గొంటున్నాడు అని మాజీ మంత్రి రోజా అన్నారు. ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడు అప్పటినుంచి రాష్ట్రంలో ఆడపిల్లలను నరికి చంపుతున్నారు కాల్చి చంపుతున్నారు. అత్తా కోడళ్ళు చిన్నారులు మతిస్థిమితం లేని వాళ్ళు అని చూడకుండా నేరస్తులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడు జరగలేదు. బాధితులకు ఏ ఒక్కరూ అండగా నిలబడలేదు. వీకెండ్ అయితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోయి పవర్ లైఫ్ ఎంజాయ్ చేయాలని సీఎం డిప్యూటీ సీఎం హోం మంత్రి చూస్తున్నారు. అత్తా కోడళ్ళ మీద అఘాయిత్యం జరిగితే ఇప్పటివరకు బాలకృష్ణ వారిని పరామర్శించలేదు. హైదరాబాదులో బాలకృష్ణ అన్ స్టాపుల్ అంటూ రియాల్టీ షో చేసుకుంటున్నాడు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. బద్వేల్ లో చనిపోయిన బాలిక తల్లి కోరిక మేరకు ఆ నిందితున్ని ఉరితీయాలి