2024లోనూ మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి – మంత్రి రోజా

-

2024లోనూ మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి అని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం నగరి మున్సిపాలిటీ పరిధిలోని నగరి వెస్ట్ సచివాలయం పరిధిలోని 26వ వార్డు మరియు 25వ వార్డు నందు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజాకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు గజమాలతో ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ….జగనన్న ద్వారానే సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ ప్రతి ఒక్కరిని పలకరించారు.. ప్రతి గడపలో హారతులు పడుతూ పూల మాలలతో స్వాగతం పలికారు దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసిన రాబోయే 2024లో మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం*. అని తెలియజేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news