ఆడవాళ్ళకి: నెలసరి సమయంలో ఆడవాళ్ళకి రకరకాల సమస్యలు రావడం సహజం. కడుపునొప్పి వికారం ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. ముఖ్యంగా కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి పీరియడ్స్ 12 లేదా 13 ఏళ్ల నుండి మొదలయ్యి 50 ఏళ్ల వరకు ఉంటాయి. మూడు రోజుల నుండి ఏడు రోజుల వరకు ప్రతి నెలా కూడా ఆడవాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. కడుపునొప్పి క్రామ్స్ మొదలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి ఒక్క మహిళ కి కూడా పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి విపరీతంగా ఉంటుంది.
అలాంటప్పుడు వంటగదిలో ఉండే ఈ సామాన్లు మనకు బాగా హెల్ప్ అవుతాయి. నెయ్యి కుంకుమపువ్వు ఎండు ఖర్జూరం చాలా సమస్యలను దూరం చేస్తాయి. ఎండుద్రాక్షని కుంకుమ పువ్వు ని, నెయ్యిని కలిపి తీసుకోండి. ఇలా తీసుకుంటే పీరియడ్ క్రాంప్స్, బ్లోటింగ్ వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే కాన్స్టిపేషన్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు.
చాలా మంది పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ ని తీసుకుంటారు దాని వలన శారీరిక సమస్యలు మానసిక సమస్యలు కూడా వస్తాయి. వాటర్ బాగ్ హీటింగ్ ప్యాడ్ వంటివి నెలసరి సమయంలో మీరు ఉపయోగించవచ్చు ఇవి చాలా బాగా పనిచేస్తాయి కడుపు నొప్పిని దూరం చేస్తాయి. ఎక్కువ నీళ్లు పీరియడ్స్ సమయంలో తీసుకుంటే కూడా చాలా సమస్యలు దూరం అవుతాయి.
వేడివేడిగా కొంచెం టీ లేదా కాఫీ ని పీరియడ్స్ టైం లో తీసుకుంటే కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. మెంతుల్ని 12 గంటల పాటు నానబెట్టి తర్వాత మెంతుల్ని పక్కకి తీసేసి ఆ నీటిని తాగితే కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అరటి పండ్లు ఆకుకూరలు తీసుకుంటే కూడా ఆ సమయంలో ఇబ్బందులు రావు ఇలా ఇబ్బందుల నుండి బయటపడొచ్చు.