త్వరలోనే తెలంగాణా నుంచి కేసీఆర్ కూడా చంద్రబాబును తరిమెస్తాడు – రోజా

-

త్వరలోనే తెలంగాణా నుంచి కేసీఆర్ కూడా చంద్రబాబును తరిమెస్తాడని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు అంటూ చురకలు అంటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎలా దొచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్టా అంటూ ఆగ్రహించారు రోజా.

సినిమాల్లో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబుకు పేరు ఉంటే…దోచుకోవడంలో కలెక్షన్ కింగ్ గా చంద్రబాబు ఉన్నాడంటూ సెటైర్లు పేల్చారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.
చంద్రబాబు ఇచ్చిన ఐటి నోటీసులపై టిడిపి నేతలు ఎందుకు నోరువిప్పరని ఆగ్రహించారు. చంద్రబాబు, లోకెష్ అవినీతి అక్రమాలపై సిబిఐ,ఈడి విచారణ జరపాలి…పిఏ శ్రీనివాస్ ఇంట్లో వేలకోట్లూ అక్రమ ఆస్తులు భయపడ్డాయంటూ చురకలు అంటించారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news