పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్‌ కమెడియన్‌, బిగ్ బాస్ ఫేం మహేశ్‌ విట్టా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు శ్రావణి రెడ్డితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హెల్త్‌ క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మహేశ్‌ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పెళ్లికి బిగ్‌బాస్‌ సీజన్‌3కు కంటెస్టెంట్లు హాజరయ్యారు.

మహేశ్ విట్టా తన సినీ ప్రయాణం యూట్యూబర్​గా ప్రారంభించాడు. యూట్యాబర్ అవతారం ఎత్తిన కొన్నాళ్లకే మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్​బాస్​లోకి అడుగుపెట్టాడు. బిగ్‌బాస్‌లో 60 రోజులకు పైగా ఉండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడా తన క్రేజ్ మామూలుగా లేదు. ఇక టెలివిజన్.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్‌ విట్టా తన రాయలసీమ యాసతో అందరినీ అలరిస్తాడు. పలు సినిమాల్లోనూ కనిపించి నవ్వించాడు. నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ అతడికి కమెడియన్‌గా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత ‘శమంతకమణి’, ‘టాక్సీవాలా’, ‘చలో’, ‘కొండపొలం’, ‘అల్లుడు అదుర్స్‌’ వంటి సినిమాల్లో కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news