ఏపీ జగన్‌ కు అమిత్‌ షా వార్నింగ్‌ !

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారిని మందలించి పంపించినట్లు తెలిసిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బీజేపీ నాయకత్వం చెబితేనే అరెస్టు చేశామని చిత్తూరు జిల్లాలో మంత్రి గారి సమక్షంలో ఒక ఎంపీ అన్నారని తెలిపారు.

ఒక మంత్రి సమక్షంలో ఎంపీ అన్నారంటే అది ఎందుకు అబద్ధం అయి ఉండకూడదు అన్న ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదని, చేసిందంతా మీరు చేసి… మమ్మల్ని అందులోకి లాగుతారా? అంటూ అమిత్ షా గారు జగన్ మోహన్ రెడ్డి గారికి అక్షితలు వేసినట్లు తెలిసిందన్నారు. తమ పార్టీకి సంబంధం లేకుండా నిందలు వేయడం మంచి పద్ధతి కాదని అమిత్ షా గారు మందలించి ఉండవచ్చునని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

హోం శాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత పోలవరం నిధులు, రైల్వే జోన్, పెండింగ్ బకాయిల కోసమే కలిసినట్లుగా రొటీన్ డైలాగులు చెప్పారన్నారు. ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగారని, లేదు పొమ్మని ప్రధాని గారు అనడంతో, బయటకు వచ్చి అపాయింట్మెంటే అడగలేదని చెబుతారని, ప్రధాని గారితో పాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే తాను భావించానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news