ఇండియాలో Oppo A18 లాంఛ్‌.. పది వేలకే బోలెడు ఫీచర్స్‌

-

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో భారత్‌లో అతి తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫోన్‌ను విడుదల చేసింది. అదే Oppo A18. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌లో యుఎఇలో లాంచ్‌ చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో ఇండియాలోనూ రిలీజ్ చేశారు. ఇది ఆక్టా-కోర్ MediaTek Helio చిప్‌సెట్ ద్వారా వస్తుంది. మంచి బ్యాటరీ, కెమెరా ఉంది. Oppo A18 ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Oppo A18 मात्र 9999 रुपये में भारत में लॉन्च, 8GB तक RAM, 5000mAh बैटरी से  है लैस

భారతదేశంలో Oppo A18 ధర :

4GB + 64GB వేరియంట్ ధర కేవలం రూ.9,999 ఉంది. ఈ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. Oppo ఆన్‌లైన్ స్టోర్‌, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Oppo A18 ఫీచర్లు :

Oppo A18 స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల HD+ (1,612 x 720 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను అందించారు.
90Hz రిఫ్రెష్ రేట్‌తో తీసుకొచ్చారు, 720 నిట్స్ ఉంది.
ఇది ఆక్టా-కోర్ MediaTek Helio G85 SoC ద్వారా పనిచేస్తుంది
Android 13-ఆధారిత ColorOS 13.1ని అమలు చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, Oppo A18లో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ సెటప్‌ను అందించారు.
సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ఈ ఫోన్లో 5,000mAh బ్యాటరీ ఉంది.
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS మరియు USB టైప్-C ఉన్నాయి.
ఇది 3.5 mm ఆడియో జాక్‌తో వస్తుంది.
పది వేలకే ఇన్ని ఫీచర్స్‌ ఇచ్చారు అంటే గ్రేటే. ఒప్పో అంటేనే సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌. బడ్జెట్‌లో తీసుకోవాలంటే ఈ ఫోన్‌ మంచి ఎంపికే.

Read more RELATED
Recommended to you

Latest news