సి-ఓటర్ సర్వే…చంద్రబాబే సీఎం అట !

-

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అడ్డుకోలేరని, స్కిల్ డెవలప్మెంట్ స్కీంలో స్కామ్ జరిగిందని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత, జనసేనతో పొత్తు కుదిరాక చంద్రబాబు గారికి అనూహ్యంగా ప్రజాదరణ పెరిగిందని తాజాగా సి ఓటర్ సంస్థ విడుదల చేసిన సర్వేలో వెల్లడైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు.

Family meeting with Chandrababu
Family meeting with Chandrababu

చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ భూమరాంగ్ అయ్యిందన్న ఆయన, ఒక అబద్ధాన్ని పదే పదే పనికిమాలిన వ్యక్తుల ద్వారా చెప్పించడం వల్ల నిజం చేయాలని చూస్తున్నారని అన్నారు. సాక్షి మీడియాలో, దినపత్రికలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ రాస్తున్నారని, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో పస లేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా వేధించి, ఆయన స్తైర్యాన్ని దెబ్బతీయాలన్న వెర్రి ప్రయత్నం మాత్రమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news