ఒక క్రెడిట్‌ కార్డుతో మరో క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లిస్తున్నారా..?

-

డెబిట్‌ కార్డుతో సమానంగా… ఈరోజుల్లో చాలామంది క్రెడిట్‌ కార్డును వాడేస్తున్నారు. క్రెడిట్‌ కార్డు నిజానికి మన ఆర్థిక అవసరాలను అన్నీ సమయానికి తీరుస్తుంది. చేతిలో డబ్బు లేకపోయినా.. మీకు కావాల్సిన వస్తువులు క్రెడిట్‌ కార్డు సాయంతో తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ కస్టమర్‌కు చాలా అవకాశాలను అందించినప్పటికీ క్రెడిట్ కార్డ్ బిల్లు టైమ్‌కి చెల్లించకపోతే చుక్కలు చూపిస్తుంది. ఆయా బ్యాంక్‌లు కస్టమర్ దగ్గర నుంచి అధిక వడ్డీ రేట్లతో పాటు లేట్ పేమెంట్ ఛార్జీల పేరుతో కార్డ్ జారీ చేసిన కంపెనీలు వసూలు చేస్తాయి. వాటిని క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తప్పకుండా చెల్లించాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. ఒక క్రెడిట్‌ కార్డుతో వేరే క్రెడిట్‌ కార్డు బిల్‌ పే చేసే ఆప్షన్‌ మీరు వినే ఉంటారు. అయితే ఇది ఎంతవరకూ కరెక్ట్‌..? దీనివల్ల మన సిబిల్‌ స్కోర్‌ దెబ్బతింటుందా..?

క్రెడిట్ కార్డులు ఇచ్చే చాలా కంపెనీలు వాటి ద్వారా వేరే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించవు. కేవలం కొన్ని కంపెనీలకు చెందిన కార్డులు మాత్రమే ఫీచర్‌ని అందిస్తుంటాయి. అయితే కొన్ని క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు అలాంటి సౌకర్యాలను కలిగిస్తున్నాయి. ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవడం వల్లే కార్డు వినియోగదారులు అదనపు రుసుములు, ఇతర ఛార్జీలు విధించవచ్చు. అయితే దీన్ని చేయాలనుకునే వారు ఈ మూడు విభిన్న మార్గాలను అవలంబించవచ్చు.

1. బ్యాలెన్స్ బదిలీ
2. నగదు ద్వారా
3. ఇ-వాలెట్‌ని ఉపయోగించడం

ఈ పద్ధతిలో, కస్టమర్ల క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను తక్కువ వడ్డీ రేట్లతో ఇతర క్రెడిట్ కార్డ్‌లకు బదిలీ చేయవచ్చు. ఇది నామమాత్రపు రుసుము వసూలు చేయడం ద్వారా వినియోగదారులకు ఆరు నెలల వరకు బ్యాలెన్స్ బదిలీని అందిస్తుంది. అయితే, బ్యాలెన్స్ బదిలీ ఛార్జీలను మాఫీ చేసే కొన్ని బ్యాంకులు ఉన్నాయి. అయితే దీని కోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. బ్యాలెన్స్ బదిలీలు కస్టమర్ల CIBIL స్కోర్‌లను ప్రభావితం చేయవచ్చు.

ఖాతాదారులకు బ్యాలెన్స్ బదిలీ రుసుము విధించబడవచ్చు. బ్యాలెన్స్‌లను బదిలీ చేస్తున్న క్రెడిట్ కార్డ్‌కు తగిన బదిలీ పరిమితులు ఉన్నాయని కస్టమర్‌లు తెలుసుకోవాలి.

ఇది ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. ఆ డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లును ఆన్‌లైన్‌లో చెల్లిస్తారు అయితే, ATM నుండి డబ్బు తీసుకోవడం వలన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.

కస్టమర్లు క్రెడిట్ కార్డ్ నుండి ఇ-వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు స్థిర మొత్తాన్ని బదిలీ చేయవచ్చు అటువంటి బదిలీలను అనుమతించే ప్లాట్‌ఫారమ్‌లు సాధారణంగా 2 శాతం రుసుమును వసూలు చేస్తాయి.

ఏది ఏమైనా… క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టడానికి మన సొంత డబ్బునే వాడాలి. అప్పుడు ఎలాంటి ఛార్జీలు పడవు. మనం చెల్లించలేనంత బిల్లును చేస్తే అది ఎప్పటికైనా.. అప్పే అవుతుంది. వచ్చే శాలరీలో కట్టగలను అనుకున్నప్పుడే ఖర్చు చేయాలని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news