పెన్షన్ ను రూ. 200 నుంచి రూ. 2000లకు పెంచింది చంద్రబాబు – వైసీపీ ఎంపీ

-

 

వృద్ధులకు అందజేసే వృద్ధాప్య పింఛను మొత్తాన్ని గత ప్రభుత్వ హయాంలో 200 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక ముందు ఏటా వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పి, ఈ నాలుగు ఏళ్ళలో కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారని, గతంలో వృద్ధాప్య పింఛన్లను లబ్ధిదారులకు పంచాయితీ కార్యాలయాల వద్ద అందజేసేవారని, ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్ మొత్తం అందజేస్తున్నారని అన్నారు.

కొన్ని చోట్ల 50 ఇళ్లలో ఒక్క లబ్ధిదారుడు కూడా ఉండకపోవచ్చునని, వాలంటీర్ వ్యవస్థ అనేది అక్కరకు లేని వ్యవస్థ అని, వాలంటీర్లుగా పని చేసే వారిని తాను కించపరచడం లేదని, ఈ ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాన్ని తప్పు పడుతున్నానని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను రఘురామకృష్ణ రాజు కించపరుస్తూ మాట్లాడారని సాక్షి దినపత్రికలో రాసుకుంటారా? రాసుకోండి. ఐ డోంట్ కేర్ అని అన్నారు. తాను ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే వాడినని, మీ వ్యక్తిగత సంక్షేమం కోసం చేసే పనులను తాను లెక్క చేసే వాడిని కాదని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సజావుగా సాగుతున్న వ్యవస్థలన్నింటిని జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్లిష్టతరం చేశారని, వ్యవస్థలన్నింటినీ క్లిష్టతరం చేయడం, దాని ద్వారా ఎలా కొట్టేయాలన్నా ధ్యాసే తప్ప ఆయనకు మరొకటి లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news