కిషన్ రెడ్డి అరెస్ట్‌ పై బండి సంజయ్ ఫైర్‌..కేసీఆర్‌ ఓ మోనార్క్‌

-

 

కిషన్ రెడ్డిని తెలంగాణ పోలీసులు చేసిన అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని పేర్కొన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్ళను అణిచి వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే ప్రశ్నిస్తుంది బిజెపి… డబుల్ బెడ్ రూ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని ఇచ్చారు… ఎన్ని కట్టిచ్చారని నిలదీశారు.

Pmay కింద ఇచ్చిన ఇళ్ళను పూర్తి చేశాం అని కేంద్రానికి నివేదిక ఇచ్చారు… లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వమని కేంద్రo ప్రశ్నించిందని తెలిపారు. మీరు కట్టిచ్చిన ఇళ్ళను చూసేందుకే బిజెపి నాయకులు వెళ్తున్నారని.. అరెస్టులు, గృహ నిర్బందాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం అని ఆగ్రహించారు బండి సంజయ్. డబుల్ బెడ్ రూం ఇల్లు అక్రమ దందాలకు నిలయంగా మారాయని.. మోనార్క్ బుద్దులు మానుకోవాలని చురకలు అంటించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news