వైఎస్ వివేకా కేసు వెనుక సాక్షి దినపత్రిక యజమాని ? RRR

-

వై.యస్. అవినాష్ రెడ్డి గారు చెప్పకుండా సాక్షి యాజమాన్యమే గుండె పోటు కథను సృష్టించిందా? అని అనుమానం వ్యక్తం చేశారు రఘురామకృష్ణ రాజు.కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ని మేనేజ్ చేసే శక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారుకి ఉండి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో జైల్లో పెట్టించి ఉండేవారు కాదా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

కడప జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్సీ సహకారంతో, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి తనను వై.యస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇరికించేందుకు సునీత గారు కుట్ర పన్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు చేసిన ఆరోపణలపై రఘురామకృష్ణ రాజు గారు స్పందిస్తూ… చంద్రబాబు నాయుడు గారికి అంతటి శక్తి ఉండి ఉంటే, 12 ఏళ్లుగా ఆర్థిక నేరాభియోగాల కేసులో సీబీఐ నోరు విప్పక పోయినప్పటికీ ఊరుకొని ఉండేవారా? అని నిలదీశారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తనని తొలుత అనుమానితునిగా పేర్కొని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇప్పుడు నిందితుడిని చేశారంటున్న అవినాష్ రెడ్డి గారి వ్యాఖ్యలపై ఆధారాలు ఉన్నాయని సీబీఐ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు..

బెంగళూరులోని కొంత మంది వజ్ర వ్యాపారులతో కలిసి వివేకానంద రెడ్డి గారు వ్యాపారం చేశారట, అప్పుడు వారి భార్యలతోనూ వివేకానంద రెడ్డి గారికి సంబంధాలు ఉన్నట్లుగా అవినాష్ రెడ్డి గారు పేర్కొనడం విడ్డూరంగా ఉందని, అవినాష్ రెడ్డి గారు ఏమైనా బెడ్ రూమ్ లో దూరి చూశారా? అని, మరి అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెబుతున్నారు అని ప్రశ్నించారు. సూటి కేసు విద్యలు ఫలించాయని అనుకున్నారు కానీ డామిట్ కథ అడ్డం తిరగడంతో, తండ్రి తర్వాత కొడుకును కూడా అరెస్టు చేస్తారని రెండు ఫుల్ పేజీల అఫీడవిట్ తో కూడిన పిటిషన్ దాఖలు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news