న్యాయస్థానాలను తీర్పు ఇవ్వమని అడిగే హక్కు సామాన్యుడికి లేదా?, న్యాయస్థానాలు మన సొమ్ముతోనే నడుస్తున్నాయని, న్యాయమూర్తులు సమాజానికి దూరంగా ఉంటారు కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, అధికారాలు ఉన్నంత మాత్రాన వాదనలు వినేసి తీర్పు మా ఇష్టం వచ్చినప్పుడు చెబుతామంటే, ప్రజాస్వామ్యం ఏమైపోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల విషయంలోనూ వాదనలు విన్న తర్వాత మూడు నెలలైనా ధర్మాసనం తీర్పు ఇవ్వకపోతే, ప్రజలు సుప్రీంకోర్టు ఆశ్రయించకుండా ఏమి చేస్తారన్నారు. ఈ కేసులో ఇవాళ మరో అరెస్టు కచ్చితంగా జరుగుతుందంటే జ్యూస్ అని చెప్పారు రఘురామకృష్ణ.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అధికారం ఉందని ప్రాథమిక హక్కుల గొంతు నొక్కేస్తారా? మూడు నెలలైనా తీర్పు రాకపోతే సుప్రీం కోర్టును ప్రజలు ఆశ్రయిస్తారని, ఈ తరహా ఆలస్యం గతంలో ఏనాడు చూడలేదని, ప్రస్తుతం చూడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఇంతలోనే దళారీల ప్రయోగం అనే వార్తలు వినిపిస్తున్నాయని, దళారీలు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన మాట నిజమని, కొంత మంది ప్రధాన న్యాయమూర్తులు దేవాలయాలకు వెళ్లినప్పుడు, వారి వెనుక సదరు దళారీ ఉన్న మాట నిజమని, ఉన్నంత మాత్రాన సేవకుడిని సేవకుడిగానే చూస్తారని, దళారీ చెప్పిన మాట న్యాయ వ్యవస్థ వినదని అన్నారు.