వైసీపీ నేతలను రజినీకాంత్ క్షమించాలి అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ మాట్లాడిన సూపర్ స్టార్ రజినీకాంత్ గారిని తమ పార్టీకి చెందిన కొందరు విమర్శించడం పట్ల తాను ఆయనకు క్షమాపణలు తెలిపానని వెల్లడించారు.
తమ పార్టీ నాయకత్వం నుంచి స్క్రిప్ట్ వస్తుందని, ఆ స్క్రిప్ట్ మీడియా ముందు చదవకపోతే పార్టీ నేతలను కొడతారని, దెబ్బలు తినే దాని కంటే… తిట్లు తిట్టడమే బెటర్ అని తమ పార్టీలోని కొంత మంది నాయకులు తిట్టారని, వారిని మంచి మనస్సుతో క్షమించాలని తాను కోరానని తెలిపారు. పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా, పార్టీ తరఫున ఆయనను క్షమాపణలు కోరే హక్కు తనకు ఉందని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తాను క్షమాపణలు కోరి ఉండేవాన్ని కాదని, రజినీకాంత్ గారి లాంటి అద్భుతమైన వ్యక్తితో అరగంట సమయం గడిపే అవకాశం తనకు లభించడం అదృష్టమని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.