AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తహశీల్దార్ రమణయ్య కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది జగన్ సర్కార్. హత్యకు గురైన తహశీల్దార్ రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందిచనుంది. అలాగే.. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా, విశాఖ జిల్లా కొమ్మాదిలో ఎమ్మార్వో రమణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి చొరబడి రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఎమ్మార్వో రమణయ్య మరణించాడు.
TDP పాలనలో నేతలు చేసిన తప్పిదాలే విశాఖలో తహశీల్దార్ రమణయ్య హత్యకు కారణం అని వైసిపి ఆరోపిస్తోంది. టిడిపి నేతలు వేలాది ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ. కోట్లు మింగేసారని అంటుంది. అవే భూములను ప్రభుత్వ భూమిగా గుర్తించి 22ఏలో పెట్టించి కొనుగోలుదారులను మోసం చేశారంది. ఇదే తరహా వివాదంలో రమణయ్య డబ్బులు తీసుకొని పనిచేయకపోవడంతో నిందితుడు సుబ్రహ్మణ్యం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని చెబుతోంది.