ఏపీలో హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు

-

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినేట్‌. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి…నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Establishment of Horticultural Food Processing Polytechnic College in AP

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పని చేయనుంది హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల. నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పని చేయనుంది అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల.

ఆంధ్రప్రదేశ్‌ ప్రేవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, రాజమండ్రిలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి….ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయ సభలను ఉద్దేశించి ద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news