నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని వెనుక నుంచి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో…. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి.

మృతులు ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వేమవరపు మరియమ్ (46) కంకణంపాడు గ్రామానికి చెందిన వేమవరపు డేవిడ్ (50)లుగా గుర్తించారు పోలీసులు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని…గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న బస్సు….నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.