ప్రధాని మోదీ సభ కోసం ఎమ్మార్పీఎస్‌ బుక్‌ చేసిన ఆర్టీసీ బస్సులు రద్దు

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్​కు రానున్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్​లో నిర్వహిస్తున్న మాదిగల విశ్వరూప మహాసభకు ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు తరలివెళ్లేందుకు ఎమ్మార్పీఎస్‌ నేతలు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను బుక్‌ చేశారు. అయితే ఆ బస్సులను ఏపీ అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు.

ఏపీలోని వివిధ డిపోల పరిధిలో రెండు రోజుల క్రితం బస్సులను ఎమ్మార్పీఎస్ నేతలు బుక్‌ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం తర్వాత అవి బయలుదేరాల్సి ఉండగా.. వీటిని రద్దు చేసినట్లు ఆర్టీసీ సమాచారం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వీటిని రద్దు చేసిందని ఎమ్మార్పీఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కడప తదితర ప్రాంతాల నుంచి శుక్రవారం బయల్దేరి వెళ్లేందుకు బస్సులు బుక్‌ చేసుకోవడంతో.. వాటిని చివరి నిమిషంలో రద్దు చేశారు. ఈ సభకు బస్సులు పంపవద్దని, స్పెషల్‌ బుకింగ్స్‌ రద్దు చేయాలంటూ ఆదేశాలు ఉన్నాయంటూ ఆయా డిపోల అధికారులు పేర్కొన్నట్లు ఎమ్మార్పీఎస్‌ నేతలు తెలిపారు. సమయం లేకపోవడంతో.. వారంతా హడావుడిగా ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకొని సికింద్రాబాద్‌ బయల్దేరారు.

Read more RELATED
Recommended to you

Latest news