తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందంటూ బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95% మాత్రమే చిన్న సన్నకారు రైతులు ఉన్నారని… వారందరికీ మూడు గంటల కరెంటు సరిపోతుందని పేర్కొన్నారు. ఒక్క గంటకు ఒక ఎకరం నీళ్లు పారుతాయని.. మూడెకరాలు ఉన్న మూడు గంటల్లో ఆ రైతు తన భూమికి నీళ్లు పెట్టుకోవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.సీఎం కేసీఆర్ పూర్వీకులంతా బీహార్‌కు చెందినవాళ్లే అని ఫైర్ అయ్యారు. దోపిడికి పాల్పడుతున్న వారిపై నేను పోరాటం చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. గతం గొప్పగా ఉంది కదా అని నెత్తిమీద పెట్టుకుని ఊరేగలేం కదా.. గెలుపు ప్రతిపాదికన టికెట్లు కేటాయించామని స్పష్టం చేశారు. అందుకే మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చామన్నారు. రాజకీయాల్లో కొత్తవారికి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు. రాజకీయాల్లో లేని వారికి కాదు.. ప్రజా జీవితంలో ఉన్న వారికే టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు.