sajjala ramakrishna reddy: ఒక్కడైన సీఎం జగన్ ను ఓడించేందుకు తోడేళ్లు, గుంట నక్కలు, ముళ్ల పందులు ఏకమయ్యాయని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో చిరంజీవి పై సజ్జల ఫైర్ అయ్యారు. కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడం పై కౌంటర్ ఇచ్చిన సజ్జల… ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి రాజకీయ నాయకులు ,సినిమా యాక్టర్లు అందరూ ఏకమవుతున్నారని నిప్పులు చెరిగారు.
పవన్ కళ్యాణ్ కి ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిలా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరువిప్పారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంటనక్కలు మరో వైపు’ అని ఆయన మండిపడ్డారు.