కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తును పోలినవి దాదాపు 8, 9 సింబల్స్ ఉన్నాయన్నారు. 2019 భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ 5 వేల ఓట్లతో ఓడిపోయింది.. కానీ మా కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తుకు ప్రచారం చేయకుండానే 27 వేల ఓట్లు వచ్చాయని వెల్లడించారు కేటీఆర్.

ఇలా మా పార్టీకి ఎన్నో సార్లు ఇలా జరిగింది.. ఇలా కొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 14 సీట్లు 6 వేల ఓట్లతో ఓడిపోయామన్నారు. ఇవన్నీ ఈసీ వాళ్లకు వివరించామని పేర్కొన్నారు కేటీఆర్. ఈవీఎంలను తొలగించి, తిరిగి బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికలను నిర్వహించాలని ఈసీని కోరామని చెప్పారు కేటీఆర్