దేవాలయాల పూజల విషయంలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో పూజలు సహా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం…. ఆయా దేవాలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దేవదాయ కమిషనర్ సహా ఏ స్ఖాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు ఇచ్చింది. అర్చకులకు విస్తృతాధికారులు కట్టబెట్టిన ప్రభుత్వం… పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ జీవో జారీ చేసింది.
ఆయా దేవాలయాల ఆగమం ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని స్పష్టం చేసిన ప్రభుత్వం…. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని జీవోలు వెల్లడించింది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని జీవో విడుదల చేసింది. ఆయా దేవాలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.