Saddula Bathukamma in Telangana today: ఇవాళ తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండగ జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధం అయింది. తెలంగాణ లోని అన్ని చెరువులు, మైదాన ప్రాంతాలు..ముస్తాబయ్యాయి. నిమజ్జన ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసారు. ప్రధాన చెరువులు కుంటలు మైదాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
తొమ్మిది రోజుల పాటు సాగిన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా నేడు 9వ రోజు సద్దుల బతుకమ్మ ఆడేందుకు సన్నద్ధం అవుతున్నారు మహిళలు.. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తుండడంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు.. నగర పాలక సంస్థ, గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్..మహిళలు పిల్లల ఆటపాటలతో తొమ్మిదిరోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొన్నదన్నారు. సద్దులబతుకమ్మతో వేడుకలు ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత సుఖశాంతులు నింపాలని కేసీఆర్ ప్రార్థించారు.