కొలాబాలోని రతన్ టాటా నివాసంలో పార్థివదేహం ఉంచారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి రతన్ టాటాకు ప్రముఖులు నివాళులు అర్పిస్తారు.. మధ్యాహ్నం 3.30కి అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ అధికారిక ప్రకటన చేసింది.
కాగా కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ళ రతన్ టాటా… ముంబయ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. గతంలో టాటా సన్స్ గ్రూప్స్‌కి చైర్మన్‌గా వ్యవహరించారు రతన్ టాటా. ఇక రతన్ టాటా మరణాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుత టాటా సన్స్ గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్.