వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో క్రియాశీలకంగా మారుతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఆమె వ్యక్తిగతమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చన్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరినా.. కే.ఏ.పాల్ పార్టీలో చేరిన మాకేం సంబంధం అని ప్రశ్నించారు.
సీటు ఇస్తేనే ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిది అని వైసీపీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు. ఈ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఒకరు, ఇద్దరు వెళ్ళిపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అమాయకత్వమేనన్నారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మరాను తప్ప జనసేన, పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదన్నారు. పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారని ఎద్దేవా చేశారు. జనసేన భవిష్యత్ లోకేష్ డిసైడ్ చేస్తున్నారన్నారు.