వివేకా హత్య కేసు : శివ శంక‌ర్ కస్ట‌డి కేసు రేప‌టికి వాయిదా

వైఎస్ వివేకా నంద కేసు విచార‌ణ ఇంకా కొన‌సాగు తుంది. ఈ కేసు లో శివ శంక‌ర్ రెడ్డి ని సీబీఐ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే నిందితుడు శివ శంకర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పులివెందుల‌ కోర్టు లో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. శివ శంక‌ర్ నుంచి స‌మాచారం రాబ‌ట్ట డానికి ఎనిమిది రోజుల స‌మ‌యం కావాల‌ని సీబీఐ త‌న ప‌టిష‌న్ లో తెలిపింది.

అందుకు అనుగూణంగా త‌మ కు ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ ద‌ఖాలు చేసింది. అలాగే సీబీఐ క‌స్ట‌డి పిటిష‌న్ కు కౌంట‌ర్ ను శివశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు దాఖ‌లు చేసింది. అయితే ఈ కేసు విచార‌ణ ను పులివెందుల రేప‌టికి వాయిదా వేసింది. కాగ వైఎస్ వివేకా నంద హ‌త్య కేసు లో నిందితుడి గా ఉన్న శివ శంక‌ర్ రెడ్డి ఈ నెల 17న హైదరాబాదులో సీబీఐ అరెస్టు చేసింది.