టిడిపి పార్టీకి షాక్.. దివ్యవాణి రాజీనామా

తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.టిడిపి అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టిడిపి లో మంచి వక్తగా, టిడిపి తరఫున గట్టి స్వరం వినిపిస్తూ.. వైసీపీ అధినేత మొదలుకొని.. మంత్రులు, ఎమ్మెల్యేలకు, మహిళా నేతలకు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ అతి కొద్దికాలంలోనే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు దివ్యవాణి. మంగళవారం నాడు ఆమె రాజీనామా చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా దివ్యవాణి తెలియజేశారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే విషయం పైన కూడా ఆమె క్లారిటీ ఇచ్చుకున్నారు.

” తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయం ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.” అని ట్విట్టర్లో ఆమె రాసుకొచ్చారు. ఇందుకు టిడిపి కార్యకర్తలు, ఆమె అభిమానులు స్పందిస్తూ.. దయచేసి ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇవాళ సాయంత్రం అమరావతిలో దివ్యవాణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతారని తెలుస్తోంది.