బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్.. ప్రపంచంలోనే అరుదైన ఆపిలండోయ్‌.. టేస్ట్‌లో బెస్ట్‌..!

-

ఆపిల్‌ అంటే.. ఎర్రగానే ఉంటుందని మనకు తెలుసు.. కానీ ఈ ప్రపంచంలో రకరాలైన కలర్స్‌లో ఆపిల్స్‌ ఉన్నాయి. అందులో ఒకటి..బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్‌. ఇదేంటి..డైమండ్‌ అంటున్నారు అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా 7500 రకాల ఆపిల్స్‌ ఉన్నప్పటికీ.. ఈ రకమైన ఆపిల్స్‌ అరుదైనది.. అందుకే ఆ. పేరు పెట్టారు కాబోలు..! ఎక్కడో టిబెట్‌లోని మారుమూల ప్రాంతంలో ఈ ఆపిల్స్‌ పండిస్తారు. ఈ ఆపిల్‌ ముచ్చటేందో చూద్దామా..!

బ్లాక్ డైమండ్ యాపిల్స్ ని చైనా వారు రెడ్ డెలిషియస్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి అరుదైన కుటుంబానికి చెందిన పండు. పులిహోరలో పులి ఎలా అయితే ఉండదో.. బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్స్ కూడా బ్లాక్‌గా ఏం ఉండవు. ఊదా ముదురు రంగులో ఉంటాయి. ఈ ప్రత్యేకమైన యాపిల్స్ టిబెట్ పర్వతాలోని ఒక చిన్న నగరమైన న్యింగ్‌చి జన్మ స్థలం. ఈ ప్రాంతంలో పగటి పూట అతినీలలోహిత కాంతి ప్రసారమవుతుంది. అయితే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలో అనూహ్యంగా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల వలన ఆపిల్స్‌ పై చర్మం రంగు ఉదా రంగులోకి మారుతుంది. అయితే పండు లోపలి భాగం.. నార్మల్ యాపిల్ లాగా తెల్లగానే ఉంటుంది.

రైతులు పెద్దగా పండిచరు..

ఈ యాపిల్స్ టిబెట్, చైనాలతో పాటు యుఎస్ లో కూడా కనిపిస్తాయి. కానీ వీటిని ఎక్కువగా పండించడానికి రైతులు ఇష్టపడరు. ఎందుకంటే చెట్టు నుంచి పండ్లు పొందడానికి ఐదు నుండి ఎనిమిది సంవత్సరాల సమంయ పడుతుందట. అంతేకాదు పండు రుచిగా మారడానికి కూడా ఎక్కువ సమయం నిల్వ చేయాలట. ఈరోజుల్లో అంత ఓపిక, టైం ఎవరికి ఉంటుంది.. కనుక లాభసాటి కాదని ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ను పండించడానికి రైతులు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ప్రతి సంవత్సరం కేవలం రెండు నెలలు మాత్రమే ఈ యాపిల్స్ అందుబాటులో ఉంటాయి.

పోషకాలు కూడా అంతంతమాత్రమే..

ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్ టైస్ట్‌లో సూపర్‌ ఉన్నప్పటికీ.. మనకు మార్కెట్‌లో లభిస్తున్న సాధారణ యాపిల్స్‌లో ఉన్నన్ని పోషకాలు ఉండవట. ఈ అందమైన ఆపిల్‌లు ఖరీదైనవే.. ఒక్కోటీ మన దేశ కరెన్సీతో పోలీస్తే రూ. 500 ఉంటుందట. చైనాలో హై-ఎండ్ సూపర్ మార్కెట్‌లలో (గిఫ్ట్ బాక్స్‌లలో) మాత్రమే విక్రయిస్తారు.

పాపం ఈ ఆపిల్‌ చూడ్డానికి తప్ప మరెందులోనూ మంచిగా లేదు కదా..! అటు పండించడానికి రైతులు ఇష్టపడటం లేదు. సరే అరుదైన యాపిల్‌ కదా.. తింటే మంచి బెనిఫిట్స్‌ ఉంటాయా అంటే..అది లేదు. టేస్టీగా ఉంటుంది అంతే..! కొన్ని ఏళ్లకు అరుదైన ఆపిల్‌ కాస్తా.. అంతరించిన ఆపిల్‌ అయిపోతుందేమో..!

Read more RELATED
Recommended to you

Latest news