జగనన్న రాజ్యంలో అరాచకం రాజ్యమేలుతుంది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

-

జగనన్న రాజ్యంలో అరాచకం రాజ్యమేలుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పుంగనూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అరాచక ప్రదేశ్ గా మారిపోయింది అన్నారు. టీడీపీ అధినేత, సీనియర్ నాయకుడు  చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనలో ఇంత దౌర్జన్యం ఎందుకు అని ప్రశ్నించారు.

అంగళ్లు లో రెచ్చగొట్టి చంద్రబాబు పై దాడి చేశారు. ఈరోజు వరకు ఒక్క వైసిపి నాయకుడిని  అరెస్ట్ చేయలేదు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2014 నుంచి 2019 వరకు ఆయనకు చీమ కుట్టలేదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అన్ని పనులు చేసుకున్నాడు. కుప్పంలో కాంట్రాక్టు వర్కులు చేసి బిల్లులు తీసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టమ్. ఇసుక అక్రమాల లై నరేంద్ర ఎన్జీటీకి పిర్యాదు చేస్తే పిడి యాక్ట్ నమోదు లోపల వేశారు అని ఆసక్తికర విషయాలను మీడియా ముందు వెల్లడించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news