ఎస్వీబీసీ ఛానల్ లో సినిమా పాటలు వేస్తున్నారు – సోము వీర్రాజు ఫైర్

-

తిరుపతి : టిటిడి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత టిటిడిదే కాదు ప్రభుత్వానిది కూడా అని…శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టిటిడిదని పేర్కొన్నారు సోము వీర్రాజు. ఇటీవల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…ఏదైనా ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకొనేముందు అందరితో చర్చించాలని డిమాండ్ చేశారు.ధార్మికభావన ప్రభుత్వానికి అధికంగా ఉండాలి…టిటిడి బజ్జెట్ రూ3500 కోట్లలో ధర్మప్రచారానికి ఎంత కేటాయిస్తున్నారనీ ప్రశ్నించారు.

ధర్మప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి…రాష్ట్ర వ్యాప్తంగా టిటిడి వేద పాఠశాలలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.ధర్మప్రచార నిధులు ఎస్వీబీసీ ఛానల్ కు 80 శాతం కేటాయిస్తున్నారు….ఎస్వీబీసీ ఛానల్ లో సినిమా పాటలు ప్రసారం అవుతున్నాయని మండిపడ్డారు.

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణకు రాజకీయ నాయకులు ఎందుకు….పద్మశ్రీ అవార్డు వచ్చిన సివచ్చత కలిగిన వారు చాలా మంది ఉన్నారు అలాంటివారిని నియమించండని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…కొన్ని సీట్లను మానేజ్ మెంట్ కోటా కింద మారుస్కున్నారన్నారు. ప్రైవేటు వైద్యకళాశాల యాజమాన్యాలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు…అక్రమాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు…జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కొత్త డ్రామాలు వేస్తున్నారని మండిపడ్డారు. తినే బియ్యం ఎందుకు ప్రజలకు ఇవ్వడం లేదు…అక్రమాలు అరికట్టకుండా నగగు ఇస్తామనడం దారుణమన్నారు

Read more RELATED
Recommended to you

Latest news