మరణం లేని మహానేత డా.బీఆర్ అంబేద్కర్ అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. సామాజిక న్యాయ మహా శిల్పం కింద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టామంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే అన్నారు. ఈ విగ్రహం అందరికీ స్పూర్తినిస్తుంది.
దళిత జాతికి బహుళజనులకు అభినందనలు తెలియజేస్తున్నా. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్ అంబే ఇకపై విజయవాడ గుర్తుకొస్తుంది. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు పెత్తందారులు. అంబేద్కర్ భావ జాలం అంటే మన పెత్తందారులకు నచ్చదు. పెత్తందారులకు, పెత్తందారుల పార్టీలకు పేదలు నచ్చరు. పోరాటానికి రూపమే అంబేద్కర్. అంటరాని తనం రూపు మార్చుకుంది. పేదలను దూరంగా ఉంచడం అంటరాని తనం కాదు. పేదవారు ఇంగ్లీషు మీడియంలో చదవద్దనుకోవడం కూడా అంటరాని తనమే అన్నారు సీఎం జగన్. దళితులకు చంద్రబాబు సెంట్ భూమి కూడా ఇవ్వలేదన్నారు.