డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో తోపులాట చోటుచేసుకుంది. కాకినాడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్వల్ప తోపులాట జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగడానికి వేదిక మీదకు దూసుకు వచ్చారు స్టూడెంట్స్. దీంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కరచాలనం కోసం ఎగబడ్డారు విద్యార్థులు. అదే సమయంలో…. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి… సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఇక అంతకు ముందు… డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా జాతీయజెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్..అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అపర కాళీ అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో… అన్న క్యాంటీన్లతో 5రూపాయలకే భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత ఐదేళ్లు లా అండ్ ఆర్డర్ క్షీంచింది,స్కూల్ కి వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదన్నారు.