ఇంకా ఎప్రిల్ నెల రాకముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 40 డిగ్రీలను క్రాస్ అవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నాం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిళ్లు కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి చివర్లోనే ఇలా ఉంటే రానున్న ఎప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే రేపటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాలలు తీవ్రత కూడా పెరుగుతందని ప్రజలను హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని….48 గంటల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం 19, వైజాగ్ 13, తూర్పుగోదావరి 2, క్రిష్ణాజిల్లాలో 10 మండలాల్లో రానున్న 48 గంటల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. దీంతో పాటు శ్రీకాకుళంలో 8, తూర్పు గోదావరి 2, గుంటూర్ 4, కర్నూల్ ఒక మండలంలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.