సీఎం కేసీఆర్ ప్రతి రోజు 3 గంటలు మాత్రమే నిద్రపోతాడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

సీఎం కేసీఆర్ ప్రతి రోజు 3 గంటలు మాత్రమే నిద్రపోతాడని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  చాలా మందికి ఈ విషయం తెలియదని.. ఆయన వెంట ఉన్న వారికి మాత్రమే ఇది తెలుస్తుందని వెల్లడించారు. రోజులో 18 నుంచి 19 గంటలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ,? ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలి అనే దానిపైనే ఆయన ఆలోచిస్తారని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా ఉంచడానికి తప్ప… కెసిఆర్ కు ఎలాంటి ఆలోచనలు తెలియదని పేర్కొన్నారు. ఆయన అనుక్షణం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తారని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే పని చేస్తుందని వివరించారు. అందరూ నేతలు లాగా సీఎం కేసీఆర్ కు స్వార్ధ ప్రయోజనాలు లేవు అని కుండ బద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయంతో గెలుపొందు తుందని ధీమా వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news