ట్రిపుల్ ఆర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ప్ర‌శంస !

-

సూపర్‌హిట్‌ సినిమాలు,టెక్నికల్‌ వండర్స్‌ అనదగ్గ సినిమాలు ఆ దర్శకుడి కేరాఫ్‌ అడ్రస్‌. ప్రపంచ సినిమాల ప్రేరణతో భారతీయసినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లిన సూపర్‌మేన్‌ ఆయన. సినిమాకు సోషల్‌కాజ్‌ ఉండాలని నమ్మే జెంటిల్‌మేన్‌ కూడా.  సామాజిక సమస్యలకు సంబంధించిన కథాంశాలను  కమర్షియల్‌ ఫార్మాట్‌లో తెరకెక్కించి సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌….శంకర్‌…

ఇక ట్రిపుల్‌ ఆర్‌ సినిమా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో అనుకున్నట్లుగానే అంచనాలను అందుకుంది. సామాన్య ప్రేక్షకులు, విమర్శకులు, సెలబ్రిటీలు ఇలా ఒక్కరేమిటి అందరూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ కూడా చేరిపోయారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకి థాంక్స్‌ చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను, డైరక్టర్‌ రాజమౌళిని ప్రశంశలతో ముంచెత్తారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన చేసిన కామెంట్స్‌ అభిమానులకు ఆసక్తిని, మూవీ టీం కి మంచి పాజిటివ్‌ వైబ్‌ను ఇచ్చాయి.
ఇంతకీ ఆయనేమన్నారంటే….ట్రిపుల్‌ ఆర్‌ సినిమా బ్యూటిఫుల్‌గా ఉంది, సినిమా చూస్తున్నంతసేపు తల తిప్పుకోనివ్వలేదు. ఈ అనుభూతి అసాధారణం. తారక్‌ నటన హృదయాలను  కదిలించింది. రామ్‌చరణ్‌ స్క్రీన్‌ప్రెజెన్స్‌ అద్భుతంగా ఉంది. స్క్రీన్‌పై వీళ్లిద్దరూ మెరుపుల్లా మెరిశారు. రాజమౌళిది తిరుగులేని టేకింగ్‌. ‘‘మహారాజమౌళి’’కి హ్యాట్సాఫ్‌.’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కాగా రామ్‌చరణతో కలిసి శంకర్‌ తన లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సంగతి విదితమే. ఇదే కాక కమల్‌హాసన్‌తో  ఇండియన్‌–2ను కూడా తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news