ఏపీ సర్కార్ కి గుడ్ న్యూస్… హైకోర్టును తప్పుపట్టిన సుప్రీంకోర్టు!

-

డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చేస్తే… అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ ఎంక్వైరీలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే! ఈ విషయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు జారీచేసింది.

అవును…. సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని సుధీర్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. సిఐడి దర్యాప్తును ఆపేయాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే! దీంతో ఏపీలో తమ పని తమను చేసుకోనివ్వడం లేదని భావించారో ఏమోకానీ… హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీంతో… సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది!

సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వడం అనే అంశంలో కేసు ఏమిటనే ఉద్దేశ్యంతో హైకోర్టు అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తుందని సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది! “దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూనే వస్తున్నాం… చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలి” అని సుప్రీంకోర్టు తేలి చెప్పింది. ఇదే క్రమంలో… “ఈ అమరావతి భూకుంభకోణం – మాజీ తహసిల్ద్ధార్ వ్యవహారాలను వారంలోగా తేల్చండి” అని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news