ఏపి మూడు రాజధానుల మీద ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే. పాలనా వికేంద్రీకరణ చట్టం అమలు పై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద కొద్ది సేపటి క్రితం విచారణ జర్గింది. పాలన వికేంద్రీకరణ చట్టం అమలు పై హైకోర్టు స్టేటస్ కో విధించడాన్ని సవాల్ చేస్తూ ఆగస్ట్ 7 న సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.
అయితే సుప్రీం కోర్టులో ఈ కేసు ఇప్పటి దాకా విచారణకు రాలేదు. పాలనా వికేంద్రీకరణ చట్టం పై తమ వాదనలు కూడా వినాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు అమరావతి రైతులు. ఈ కేసులో ఈరోజు విచారణ చేసిన ధర్మాసనం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తరువుల పై స్టే ఇవ్వలేమన్న సుప్రీం, సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టు కు సూచించింది. ఇక కేసు రేపు హైకోర్టు లో విచారణ జరగనుంది.