ఏపీ ప్రజలకు శుభవార్త..ఈ నెల 29 వాహనమిత్ర డబ్బుల జమ

-

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. ఈ నెల 29 వాహనమిత్ర డబ్బుల జమ చేయనున్నారు సీఎం జగన్‌. సీఎం జగన్ ఈనెల 29న కాకినాడలో పర్యటించనున్నారు. వైయస్సార్ వాహన మిత్ర ఐదో విడత డబ్బులను ఆయన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

- Advertisement -
 Ysr vahana mitra scheme 5th phase money distribution
Ysr vahana mitra scheme 5th phase money distribution

సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో కలిసి కలెక్టర్ కృతిక శుక్ల ఏర్పాట్లను పరిశీలించారు. సమయం తక్కువగా ఉండటంతో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా.. ఇవాళ్టి సభలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు- 2023, ఏపీ వైద్య విధాన పరిషత్ రిపీల్ (రద్దు) బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023 ఇవాళ్టి సభలో ఈ మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం – తీసుకున్న చర్యల పై స్వల్ప కాలిక చర్చ కూడా జరుగనుంది. ఇక నిన్న టీడీపీ సభ్యులు ఒక రోజు పాటు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...