రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు పై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. పోలీస్ అకాడమీ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది ఓ ట్యాంకర్. అలాగే…. ఔటర్ రింగు రోడ్డు లో కార్లు ఆపి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు యువతి, యువకులు. అయితే… ఒక్కసారిగా వారి పైకి దూసుకు వచ్చింది ట్యాంకర్. దీంతో అక్కడిక్కడే యువతి, యువకుడు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

యువతి, యువకుడు మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. వీకెండ్ కావడంతో ఎయిర్ పోర్ట్ సమీపంలో ఫుడ్ కోర్టుకు వెళ్లిన విద్యార్దులు…..తిరుగు ప్రయాణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…..మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. అయితే…యువతి, యువకుడు ఇద్దరు లవర్న్ అని పోలీసులు అనిమానిస్తున్నారు.