ఏపీలోని వైసీపీ కార్యాలయాలు కూల్చేందుకు టీడీపీ కుట్రలు ?

-

వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చేస్తామని అనంతరమే కాకుండా… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు ఇష్యూ చేసింది చంద్రబాబు సర్కార్‌. అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతోంది చంద్రబాబు సర్కార్‌. వీఎంఆర్డీఏ అనుమతులున్నప్పటికీ విశాఖ, అనకాపల్లిలో విడ్డూరంగా చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తోంది.

TDP conspiracies to demolish YCP offices in AP

జీవీఎంసీ ఇవ్వలేదంటూ వింతగా నోటీసులు జారీ చేసింది. నెల్లూరులో కూలదోస్తామని అధికారులు హడావుడి చేశారు. అటు ‘అనంత’లో ఆఫీస్ బాయ్ కి నోటీసు ఇచ్చి వెళ్లింది నగర పాలక సంస్థ సిబ్బంది. రాజమహేంద్రవరంలో పార్టీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్‌.

ఇక అటు   విశాఖ ఎండాడలోని వైసీపీ కారాలయానికి చేరుకున్న మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్….GVMC నోటీసులు చించేశారు. నోటీసులపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది టౌన్ ప్లానింగ్ విభాగం. కార్యాలయంలో ఎవరు లేని సమయంలో గోడలకు నోటీసులు అతికించి వెళ్ళడంపై వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగాంగానే.. విశాఖ ఎండాడలోని వైసీపీ కారాలయానికి చేరుకున్న మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్….GVMC నోటీసులు చించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news