చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి బలవంతపు జన సమీకరణ

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ బలవంతపు జన సమీకరణ చేపడుతుంది. చంద్రబాబు అరెస్టయినా కార్యకర్తలు రోడ్లమీదకు రావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వెంటనే జన సమీకరణ చేయాలంటూ నాయకులతో అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అచ్చెన్నాయుడు టీడీపీ నేతలతో మాట్లాడిన టెలీకాన్ఫరెన్స్ ఆడియో లీక్ అయ్యింది.

దీంతో ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు రోడ్ల మీదకి రావడం లేదంటూ అచ్చెన్నాయుడు లీక్ అయిన ఆడియోలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకి తీసుకురావాలటూ టిడిపి నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు ఈ ఆడియోలో సలహాలు ఇస్తున్నారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news